Mountain View


అక్ఠోబర్ 2015 కరెంట్ అఫైర్స్ 545


హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి సెప్టెంబరు 28న భారత్-అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో రక్షణ అవసరాల కోసం భారత్ రూ.19.86 వేల కోట్ల వ్యయంతో 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్లను కొంటుంది.

జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్‌తో కూడిన 28 సభ్యుల బృందం భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం అక్టోబరు 4న న్యూఢిల్లీ చేరుకుంది. భారత్‌లో సౌర ఇంధన ప్రాజెక్టులకు రూ.7,300 కోట్ల మేర జర్మనీ ఆర్థిక సాయం అందించనుంది. ఈ సందర్భంగా మెర్కల్ 10వ శతాబ్దంలో కశ్మీర్‌లో చోరీకి గురైన మహిషాసుర మర్దిని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు.

ప్రపంచ పోటీతత్వ సూచీని (The Global Competitiveness Report ) 2015-16 ప్రపంచ ఆర్థిక ఫోరం (World Economic Forum) సెప్టెంబరు 29న విడుదల చేసింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానం దక్కించుకుంది. సింగపూర్, అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2014-15లో 71వ స్థానంలో ఉన్న భారత్ ఈ సంవత్సరం సూచీలో 16 స్థానాలను మెరుగుపరచుకుని 55 వ స్థానంలో నిలిచింది.

నేపాల్ 38వ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ అక్టోబరు 12న ప్రమాణస్వీకారం చేశారు. అక్టోబర్ 11న జరిగిన ఎన్నికల్లో సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలీ నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుశీల్ కొయిరాలాపై విజయం సాధించారు.

అమెరికా,కెనడా, మెక్సికో, పెరు, చిలీ, జపాన్, వియత్నాం, బ్రునై, మలేసియా, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా ఈ 11 పసిఫిక్ దేశాల మధ్య అక్టోబరు 5న అతి పెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Trance Pacific Partnership) కుదిరింది.

జోర్డాన్ పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోర్డాన్‌లోని అమ్మన్‌లో గాంధీ పేరిట ఏర్పాటుచేసిన ఓ వీధిని ప్రణబ్ ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రణబ్ చారిత్రక పర్యటనకు గుర్తుగా అమ్మన్ సిటీ కౌన్సిల్ ఆయనకు ‘గోల్డెన్ కీ ఆఫ్ అమ్మాన్’ను బహూకరించింది.

ప్రపంచ దారిద్రరేఖను ప్రపంచ బ్యాంకు సవరించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న రోజు వారీ సంపాదనను 1.25 డాలర్ల నుంచి 1.90 డాలర్లకు (రూ.130) సవరించింది.

గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్‌స్టిట్యూట్’ నిర్వహించిన సర్వేలో ఉద్యోగులు పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడే కంపెనీల జాబితాలో గూగుల్ ప్రథమస్థానంలో ఎస్‌ఏఎస్ ఇన్‌స్టిట్యూట్, వీఎల్‌గోరే వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ప్రపంచ పింఛన్ సూచీ పరంగా ‘భారత పదవీ విరమణ వ్యవస్థ’ చివరి స్థానంలో నిలిచిందని ప్రముఖ అధ్యయన సంస్థ మెర్సెర్ పేర్కొంది.ఈ సూచీలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది.

కెనడా పార్లమెంటుకు అక్టోబర్ 18న జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ నేత, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కుమారుడు జస్టిన్ ట్రూడో , ప్రస్తుత ప్రధాని స్టీఫెన్ హార్పర్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ పై విజయం సాదించారు. ఇదే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 19 మంది కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు.