Mountain View


మే 2015 కరెంట్ అఫైర్స్ 571


Ans :
శ్రీలంక అధ్యక్షుడు, పార్లమెంట్ కాలం ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు కుదిస్తూ శ్రీలంక పార్లమెంటు రాజ్యాంగ సవరణకు 2015 ఏప్రిల్ 28న ఆమోదం తెలిపింది . దీనితో పాటుగా ఒక వ్యక్తి అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు మాత్రమే కొనసాగే విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టారు .

ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో వార్షిక ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు సిరియన్ జర్నలిస్ట్ మజెన్ డార్విష్‌కు దక్కింది .

అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన తొలి భారత పర్యటనలో 2015 ఏప్రిల్ 28న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.  రక్షణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, రవాణా తదితర రంగాల్లో సహాయంతో పాటు పాకిస్థాన్ సరిహద్దులో వాఘా - అట్టారీ వద్ద అఫ్ఘాన్ ట్రక్కులు ప్రవేశించేందుకు ప్రధాని సమ్మతి వ్యక్తం చేశారు.

ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ గీత ఫోగట్ కాంస్య పతకం గెలిచింది. దోహాలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో మే 6న జరిగిన మహిళల ఫ్రీ స్టయిల్ 58 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో ఆమె... వియత్నాంకు చెందిన థి లొన్ నైగుయెన్‌ను కంగుతినిపించింది.  650 స్థానాలకు గాను కన్సర్వేటివ్ పార్టీ 331 స్థానాల్లో విజయం సాదించగా, లేబర్ పార్టీ 232 స్థానాలు గెలుపొందింది.

మే 7న జరిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ విజయం సాధించారు. కామెరూన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ , ఎడ్ మిలిబండ్ నాయకత్వంలో పోటీచేసిన లేబర్ పార్టీ పై విజయం సాదించింది

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలు ఏర్పాటుచేస్తున్న న్యూ డెవలప్‌మెంటల్ బ్యాంకుకు ప్రముఖ బ్యాంకరు కె.వి.కామత్‌ను భారత్ మే 11న నామినేట్ చేసింది. పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది . న్యూ డెవలప్‌మెంటల్ బ్యాంకు ప్రదాన కార్యాలయం షాంఘై (చ్లైనా) లో ఉంది.

మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను పెట్రా క్విటోవా మే 9న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వెత్లానా కుజనెత్సోవాను ఓడించి గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే.. ఫైనల్లో రఫెల్ నాదల్‌ను ఓడించి గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న (భారత్), ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా).. ఫైనల్లో నెనాద్ జిమోంజిక్ (సెర్బియా), మార్సిన్ మట్‌కోవిక్సీ (పోలండ్)లను ఓడించి గెలుచుకున్నారు. 

ప్రపంచ అతిపెద్ద పది కన్సూమర్ ఫైనాన్స్ కంపెనీల్లో భారత్‌కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ ఏడవ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ రూపొందించిన ఈ టాప్ 10 జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారత కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీయే.

ఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లే హెబ్డోకు పెన్ (ఫ్రీడమ్ ఎక్స్‌ప్రెషన్ కరేజ్) అమెరికన్ సెంటర్ అవార్డును మే 5న న్యూయార్క్‌లో ప్రదానం చేశారు .

న్యూయార్క్‌లో క్రిస్టిస్ సంస్థ మే 11న నిర్వహించిన వేలంలో ప్రఖ్యాత స్పానిష్ చిత్రకారుడు పాబ్లో పికాసో వేసిన ఉమెన్ ఆఫ్ అల్జీర్స్ (వెర్షన్ ఓ) చిత్రం రూ. 1,154 కోట్లు పలికింది. ఇంతవరకు అత్యదిక దర పలికన చిత్రం ఇదే .

న్యూయార్క్‌లో క్రిస్టిస్ సంస్థ మే 11న నిర్వహించిన వేలంలో స్విట్జర్లాండ్ శిల్పి ఆల్బర్ట్ జియకోమెట్టి వేసిన పాయింటింగ్ మేన్ అనే శిల్పం రూ. 909 కోట్లు పలికింది. ఇంతవరకు అత్యదిక దర పలికన శిల్పం ఇదే .

ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 18న జెనీవాలో 68వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాలు 'ఆరోగ్యం, పర్యావరణం: ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావం' పేరిట ప్రారంబించింది.

ఐర్లాండ్ లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో(రెఫరెండమ్) 70 శాతం మంది అనుకూలంగా ఓటువేశారు. దీంతో స్వలింగ వివాహాలకు ఓటింగ్ ద్వారా చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఐర్లాండ్ నిలిచింది.

ఐక్యరాజ్యసమితి మే 27న విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశం ఆకలితో బాధపడే 19.40 కోట్ల మందితో మొదటి స్థానంలో ఉంది. 13.38 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది .

ఫోర్బ్స్ పత్రిక మే 26న ప్రపంచంలో శక్తిమంతమైన 100 మంది మహిళలజాబితాను విడుదల చేసింది. వీరిలో భారతదేశానికి చెందిన నలుగురు ఉన్నారు. ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య (30వ స్థానం), ఐసీఐసీఐ బ్యాంకు అధిపతి చందా కొచ్చర్ (35వ స్థానం), బయోకాన్ సంస్థ స్థాపకురాలు కిరణ్ మజుందార్(85వ స్థానం), హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్ శోభనా భాటియా(93వ స్థానం)లకు చోటు దక్కింది. మొదటి స్థానంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ,రెండో స్థానంలో హిల్లరీ క్లింటన్ , మూడో స్థానంలో మిలిండా గేట్స్ ఉన్నారు.

మారిషస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా అమీనా ఫకీమ్ ను ఎంపిక చేస్తూ మారిషస్ పార్లమెంట్ మే 28న తీర్మానాన్ని ఆమోదించింది.

10 వ వరల్డ్ టీం చెస్ చాంపియన్ సిప్(World Team Chess Championship) ని సఖాడ్జొర్(Tsaghkadzor) లో ఎప్రిల్ 18 2015 ప్రారంబించారు.

వరల్డ్ టీం చెస్ చాంపియన్ సిప్ (World Team Chess Championship) ని మొదటిసారిగ 1985 లో ప్రారంబించారు. ప్రతి 4 సంవత్సరాలకొకసారి నిర్వహించేవారు , 2011 నుంచి ప్రతి 2 సంవత్సరాలకొకసారి నిర్వహిస్తున్నారు .

వరల్డ్ టీం చెస్ చాంపియన్ సిప్ 2015 (World Team Chess Championship 2015) లో మొత్తం 10 దేశాలు పాల్గొన్నాయి . వీటిలో భారతదేశం కూడా ఒకటి . ఈ చాంపియన్ సిప్ లో చైనా స్వర్ణాన్ని గెలుచుకోగా , ఉక్రెయిన్ రజతాన్ని , ఆర్మేనియా కాంస్యాని గెలుచుకున్నాయి .

వరల్డ్ టీం చెస్ చాంపియన్ సిప్ 2015 (World Team Chess Championship 2015) మహిళల విభాగంలో జార్జియా స్వర్ణాన్ని గెలుచుకోగా , రష్యా రజతాన్ని , చైనా కాంస్యాని గెలుచుకున్నాయి .