Mountain View


జూన్ 2015 కరెంట్ అఫైర్స్434


అమెరికాకు చెందిన వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ 2015 సంవత్సరానికిగానూ ప్రపంచ సమన్యాయ పాలన(Rule Of Law) సూచీని జూన్ 2న విడుదల చేసింది. దీనిలో భారత్‌కు 59వ స్థానం దక్కింది . డెన్మార్క్, నార్వే, స్వీడన్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

జీ-7 దేశాల 41వ సదస్సు జర్మనీలోని బవారియన్ ఆల్ఫ్స్‌లో జరిగింది. ఈ సదస్సు లో కర్బన ఇంధనాల వాడకాన్ని 2100 నాటికి నిలిపేసేందుకు నేతలు అంగీకరించారు. అమెరికా, యూకే, జపాన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జర్మనీ నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో రష్యాపై ఆంక్షలకు సంబందించి నిర్ణయం తీసుకోవడానికి ఈ సదస్సు ఉద్దేశించడమయింది .

26 ఆఫ్రికా దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్ ఒప్పందం ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో జరిగింది.

బ్రిటన్ జాతీయ పక్షి కోసం 60 పక్షులతో నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో రాబిన్ పక్షి (34 శాతం)అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రాబిన్ బ్రిటన్ జాతీయ పక్షిగా ఎంపికకానుంది. దీని తర్వాతి స్థానాల్లో బార్న్ పక్షి (12 శాతం ఓట్లు), బ్లాక్ బర్డ్ (11శాతం ఓట్లు) నిలిచాయి.

అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మెడలైన్ ఆల్బ్రైట్ చైర్‌పర్సన్‌గా ఐక్యరాజ్యసమితి 14 మంది సభ్యులతో ఏర్పాటుచేసిన కమిటీ జూన్ 9న నివేదిక సమర్పించింది. ఈ కమిటీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించాలని సిఫార్సు చేసింది. 21వ శతాబ్దంలో వాతావరణ మార్పులు, సంఘర్షణలు, ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొనేందుకు ప్రస్తుత ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలకు తగిన సామర్థ్యం లేదని ఆల్బ్రైట్ తెలిపారు.

అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అగ్రనేత నాసిర్ అల్-ఉహాయిషీ మరణించినట్లు అల్‌ఖైదా సంస్థ అరేబియా ద్వీపకల్ప విభాగం జూన్ 15న ప్రకటించింది.

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు.

ప్రపంచ ఆర్థిక ఫోరం(World Economic Forum) ప్రచురించిన ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగివున్న టాప్-10 సంస్థల జాబితాలో రెండు భారతీయ సంస్థలు చోటు సంపాదించాయి. 14 లక్షల మంది సిబ్బందిని కలిగి ఉన్న భారతీయ రైల్వేలు ఎనిమిదో స్థానంలో నిలిచింది. 13 లక్షల ఉద్యోగులతో భారత ఆర్మీ 9వ స్థానంలో లో నిలిచింది. ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా అమెరికా రక్షణ శాఖ ( 32 లక్షల మంది ) నిలుస్తోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా ఆర్మీ 23 లక్షల మంది ) రెండో స్థానంలో నిలిచింది. అమెరికా సూపర్ మార్కెట్ వాల్‌మార్ట్ ( 21 లక్షల మంది ) మూడో స్థానం పొందింది.