Mountain View


జూలై 2015 కరెంట్ అఫైర్స్ 474


అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారసత్వ నగరాల జాబితాలో యెమెన్ రాజధాని సనా చేరింది. యెమెన్‌లోని మరో నగరం షిబమ్‌తో పాటు ఇరాక్‌లోని హత్రా సిటీ కూడా ఈ జాబితాలో చేరాయి.

ఏడో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల సదస్సు రష్యాలోని ఉఫాలో జూలై 9న జరిగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జూమా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్, దక్షిణాఫ్రికా చేస్తున్న ప్రయత్నాలకు బ్రిక్స్ మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్ వివాదంలో రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను బ్రిక్స్ వ్యతిరేకించింది.

షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organisation ) లో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించేందుకు జూలై 10న ఉఫా సదస్సులో అంగీకరించారు. ఈ మేరకు భారత్, పాకిస్తాన్‌లకు సభ్యత్వాన్ని కల్పిస్తారు. ఈ సంస్థలో భారత్ 2005 నుంచి పరిశీలక హోదాలో ఉంది. 2016 నుంచి భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం లభిస్తుంది. ఉగ్రవాదంపై పోరు, వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం ఏర్పడిన ఎస్‌సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తోంది. పూర్తిస్థాయి సభ్యత్వాన్ని అంగీకరించిన సభ్యదేశాలకు ఈ సదస్సులో పాల్గొన్న మోదీ కృతజ్ఞతలు తెలిపారు. Organisation for Economic Co-operation and Development

సమర్థవంతమైన పాలన, మంచి పర్యావరణం, వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల ఆధారంగా దేశాలకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న రెప్యుటేషన్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో 2015 సంవత్సరానికి ప్రపంచంలో మంచి ప్రతిష్ట కలిగిన దేశాల్లో కెనడా మొదటి స్థానంలో నిలిచింది. భారత్ 33వ స్థానంలో ఉంది. నార్వే, స్వీడన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

దివంగత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జయంతి అయిన అక్టోబర్ 15వ తేదీని అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ఐక్యరాజ్య సంస్థ నిర్ణయించింది.