Mountain View


ఆగస్ట్ 2015 కరెంట్ అఫైర్స్ 558
2022 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని జూలై 29న విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. 

ట్రిప్ అడ్వైజర్ సంస్థ చేసిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన పర్యాటక నగరంగా కాన్‌కున్(మెక్సికో) మొదటి స్థానంలో నిలిచింది. జురిచ్(స్విట్జర్లాండ్), న్యూయార్క్(అమెరికా), లండన్(బ్రిటన్) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ప్రఖ్యాత సూయజ్ కాలువకు సమాంతరంగా మరో కాలువను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్‌సిసీ ఆగస్టు 6న ప్రారంభించారు. కాలువ ప్రారంభ కార్యక్రమంలో భారత్ తరఫున కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. 1869 నవంబరు 29న సూయజ్ కాలువను అధికారికంగా ప్రారంభించారు. దీనివల్ల ఐరోపా నుంచి భారత్‌కు వెళ్లే నౌకల ప్రయాణం 7 వేల కిలోమీటర్లు తగ్గింది.

ఉత్తర చైనాలోని తియాంజిన్ నగరంలో ఓ రసాయనిక పదార్థాల గోడౌన్‌లో భారీ పేలుళ్ళు కారణంగా చైనా తన సూపర్ కంప్యూటర్ ‘త్యాన్‌హే-1ఎ’ను అరగంట షట్‌డౌన్ చేసింది. దీని నిర్వహణ కేంద్రం ప్రమాద ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.

శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో విక్రమసింఘే నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ (UNP) మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స ప్రాతినిధ్యం వహిస్తున్న యునెటైడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్(UPFA) పార్టీ పై విజయం సాధించింది.

భారత 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ పరిశ్రమల వ్యవస్థాపన కోసం ‘స్టార్టప్ ఇండియా - స్టాండప్ ఇండియా’ నినాదంతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

సౌదీ అరేబియా చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 12, 2015వ తేదీనజరిగే కింగ్‌డమ్ మున్సిపాలటీ ఎన్నికలు ఇందుకు వేదిక కానున్నాయి. 2011లో సౌదీ రాజు అబ్దుల్లా మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రముఖ మేగజైన్ ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచంలో అత్యంత ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో అమెరికాకు చెందిన టెస్లా మోటార్స్ అగ్రస్థానం దక్కించుకుంది. సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్‌డాట్‌కామ్ రెండో స్థానంలో నిలిచింది.

భారత్ సీషెల్స్ మధ్య ఆగస్టు 26న నల్లధనం నిర్మూలనకు భారత్-సీషెల్స్ ఒప్పందం జరిగింది. సీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ మైఖెల్ భారత్‌ను సందర్శించినప్పుడు ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పన్ను ఎగవేతను అరికట్టేలా సమాచారం మార్పిడికి రెండు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.

ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ మెకిన్లీ .1896లో అప్పటి కాబోయే అమెరికా అధ్యక్షుడు విలియమ్ మెకిన్లీ పేరు ఈ పర్వతానికి పెట్టారు. అయితే ఆ పేరు ఈ ప్రాంత ప్రజలకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల కోరిక మేరకు పర్వతం పేరు ‘దెనాలి’గా మారుస్తున్నట్లు ఒబామా ప్రకటన జారీ చేశారు.