Mountain View


దిగివచ్చిన పసిడి దర509

Smiley face

రికార్డులతో దూసుకెళ్తున్న బాహుబలి సినిమా మరో కొత్త రికార్డు సాధించింది. ఈ సినిమాకు సంబంధించి కొచ్చిలో ప్రదర్శించిన పోస్టర్ ను ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. కేరళలో ఈ సినిమా హక్కులు కొన్న గ్లోబల్ యునైటెడ్ మీడియాకు ఈ భారీ పోస్టర్ రూపొందించాలన్న ఆలోచన వచ్చింది. దీన్ని స్వయంగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళే డిజైన్ చేశారు. ఈ పోస్టర్ 51,598 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని గిన్నిస్ వెబ్ సైట్ తెలిపింది. ఇంతకు ముందున్న రికార్డు 50687చదరపు అడుగులు మాత్రమే. పెద్ద సినిమా కాబట్టే ఇంత పెద్ద పోస్టర్ రూపొందించగలిగామని గ్లోబల్ యునైటెడ్ మీడియా ఎండీ ప్రేమ్ మీనన్ తెలిపారు.ఇందుకోసం ఆయన సినిమా నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, దర్శకుడు రాజమౌళిలకు కృతజ్ఞతలు చెప్పారు.మొత్తం 25 మంది సభ్యులు రోజుకు 24 గంటల చొప్పున 4 రోజుల పాటు కష్టపడి ఈ పోస్టర్ ను తయారుచేశారు.