Mountain View


యజ్ణం కాంబినేసన్లొ కొత్త సినిమా638

Smiley face

           గోపీచంద్‌ కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. రెజీనా కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘‘యజ్ఞం’ సినిమా వచ్చిన పదకొండేళ్ల్లకు గోపీచంద్‌తో మళ్లీ సినిమా చెయ్యడం ఆనందంగా ఉంది. వినూత్నమైన కథతో తెరకెక్కుతోంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనరిది. నా తాలుక ఎమోషన్స్‌ మిస్‌ కాకుండా ఉంటుంది. హిట్‌ సినిమాకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కథ డిమాండ్‌ మేరకు ఇందులో చాలా పాత్రలుంటాయి. ప్రతి పాత్రకు తెరపై ప్రాధాన్యత కనిపిస్తుంది’’ అని అన్నారు. ‘‘యజ్ఞం’తో సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్న గోపీచంద్‌, రవికుమార్‌తో ఈ సినిమా చెయ్యడం హ్యాపీగా ఉంది. ఈ నెల 25 నుంచి తాజా షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 25న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.