Mountain View


'కంచె' దాటింది 693

Smiley face

           ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమ లో టాక్ ఆఫ్ ది మూవీ , కొత్తదనం కోరుకునె ప్రేక్షకులుకు నోరూరిస్తున్న మూవీ 'కంచె ' . ప్రస్తుతం ‘కంచె’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాని చూసిన సెన్సార్ వాల్ల నుండి కూడ పాజిటివ్ టాక్ రావడంతో అబిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వార్ సన్నివేశాలు చాలా బాగా రావడంతో పాటు లవ్ ట్రాక్ కూడా బాగా కుదిరిందని సెన్సార్ టాక్. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనివార్యకారణాల వల్ల వాయిదా పడింది. నవంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.