Mountain View


హిమాలయాల్లో అన్నీ రహస్యాలే : రజనీకాంత్533

Smiley face

           హిమాలయాల్లో మనిషికి అందని రహస్యాలు చాలా ఉన్నాయని ప్రపంచంలో ఉన్న చాలా మంది ఆద్యాత్మిక వేత్తలు భావిస్తుంటారు . వీటిపై ప్రపంచవ్యాప్తంగా చాలా పుస్తకాలు , కథలు కూడ ఉన్నాయి . ఇవన్ని ఇప్పుడు ఎందుకంటె , ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గోన్న హీరో రజనీ కాంత్ కొన్ని ఆసక్తకరమైన మాటలు చెప్పాడు . ఆవి ఏంటంటె

. తాను ఎంత డబ్బు సంపాదించినా.. పేరు తెచ్చుకున్నా తనకు ఆధ్యాత్మిక ప్రయాణం ఇచ్చే ఆనందమే వేరు అంటున్నాడు రజినీ. తానెందుకు హిమాలయాలకు వెళ్తానో.. అక్కడేం చేస్తానో ఆక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రజినీ వివరించాడు.

‘‘ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లాలని ఎప్పుడో కోరుకున్నాను. డబ్బు.. ఇతర విషయాల కంటే ఆధ్యాత్మికత ఎక్కువ సంతృప్తినిస్తుంది. నాకు శక్తినిచ్చేది అదే. ఈ విషయంలో నాకు తొలి గురువు నా తమ్ముడు సత్యనారాయణే. అతనే నన్నీ వైపు నడిపించాడు. ఇక ఆధ్యాత్మికంగా నన్ను ప్రభావితం చేసిన గురువు సచ్చిదానంద. ఆయన చనిపోయాక నేను చాలామంది గురువుల్ని అనుసరించాను. రాఘవేంద్రస్వామి నుంచి చాలా నేర్చుకున్నా. రమణ మహర్షి ద్వారా నేనేంటో తెలసుకునే ప్రయత్నం చేశా. పరమహంస యోగానంద ఆత్మకథ నాపై చాలా ప్రభావం చూపింది. ఆధ్యాత్మికత విషయంలో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. హిమాలయాల్లో చాలా గొప్ప రహస్యాలు ఉన్నాయి. వాటి కోసమే నేను అక్కడికి వెళ్తుంటా. ఆ ప్రయాణంలో నాకు కలిగే ఆనందమే వేరు’’ అని రజినీ వివరించాడు.