Mountain View


కర్ణాటక రైతులుపై అధికారుల కర్కశత్వం924

Smiley face

           కర్ణాటకలోని విద్యుత్ అదికారులు అదికార మదం వల్ల ఒ యువరైతు జీవితం నాశనమైంది . ఆసలు ఎమి జరిగింది అంటే . కర్నాటక రాష్ట్రంలోని మధుగిరి నుంచి పావగడ వరకు కేపీటీసీఎల్‌ 220 కేవీ హైపవర్‌ విద్యుత్‌ తీగలు లాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని మెళవాయి గ్రామానికి చెందిన సుబహాన్‌ సాబ్‌ పొలంలో విద్యుత్‌ టవర్లు నిర్మిస్తున్నారు. తన భూమికి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు సాగాలని తన కొడుకు నబీరసూల్‌తో కలిసి పనులకు అడ్డుపడ్డాడు. తమ భూమిలో విద్యుత్‌ తీగలు లాగుతున్న సమయంలో తండ్రి కొడుకులు ఇద్దరు తీగలను గట్టిగా పట్టుకుని పనులకు ఆటంకం కలిగించబోయారు. వీరిద్దరూ 30 అడుగుల ఎత్తుకు వెళ్లినా 15 నిమిషాల పాటు వైర్లకు వేలాడారు. బాధితులు అరుస్తున్నా పట్టించుకోకుండా వారి పనుల్లో నిమగ్నమయ్యారు. గాల్లో వేలాడే శక్తి చాలక తండ్రి కొడుకులు ఒకరి తర్వాత ఒకరు కిందికి దూకేశారు. కొడుకు నబీరసూల్‌ ఎక్కువ ఎత్తు నుంచి దూకడంతో అతడి వెన్నుముక విరిగింది. దీంతో అతడిని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనను రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.