Mountain View


90 రోజులు దాటితే సస్పెన్షన్ చెల్లదు656

Smiley face


ఉద్యోగులు, అధికారులకు సంబంధించి 90 రోజులు దాటితే ఉద్యోగుల సస్పెన్షన్ చెల్లదు అని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా ఉంది.ఉద్యోగులకు ఒక రకంగా రిలీఫ్ ఇచ్చేదిగా భావించవచ్చు. చార్జీషీట్ లేకుండా నెలలు,ఏళ్ల తరబడి సస్పెన్షన్ లో ఉంచుతూ కొన్ని ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తుంటాయి లేదా వివిద కారణాల వల్ల చార్జీషీట్ వేయకుండా కాలయాపన చేస్తుంటాయి. దాని వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటారు. అవమానాలకు గురి అవుతుంటారు. ఈ నేపధ్యంలో తొంభై రోజులు మించి సస్పెన్షన్ లో ఉంచరాదని సుప్రింకోర్టు పేర్కొంది. చార్జీషీట్ వేయకపోతే వారి సస్పెన్షన్ తొలగించాలని కశ్మీర్ కు చెందిన ఒక అదికారి వేసిన పిటిషన్ లో తీర్పు ఇచ్చింది.