Mountain View


రియల్ గజిని686

Smiley face

           గజినీ సినిమా గుర్తుందా? అందులో సూర్య, అమీర్‌లకి.. 15 నిమిషాలు మించి ఏదీ గుర్తుండదు. కేవలం ఆసిన్‌ని ఎవరో చంపారన్న సంఘటన మాత్రమే గుర్తుంటుంది. అలాంటి ఒక వ్యాధి ఉందని ఈ సినిమా చూసేవరకు ఎవరికీ తెలియదు. కానీ ఇలాంటి కేసే ఇప్పుడు బ్రిటన్‌లో నమోదయింద. ఒకతను 90 నిమిషాలకోసారి గతం మర్చిపోతుంటాడు. ఆ తర్వాత మళ్లీ అన్నీ గర్తు చేయాల్సిందేనట! అతని దగ్గర ఎప్పుడూ ఒక ఎలక్ట్రానిక్ డైరీని ఉంచుతారు. అది ఎప్పుడూ ప్రాప్టింగ్ ఇస్తూ ఉంటుంది. అలా అతను అన్ని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు.. పదేళ్ల కిత్రం పంటి నొప్పితో డాక్టరు దగ్గరకు వెళ్లాడు. ఆ డాక్టరు రూట్ కెనాల్ చికిత్స చేశాడు. ఆ క్రమంలో మత్తుమందు ఇచ్చి శస్త్ర చికిత్స చేశాడు. ఇక అప్పటి నుంచి అతడి మెమొరీ పవర్ 90 నిమిషాలు మాత్రమేనట. డాక్టర్ గేరాల్డ్ బర్గెస్ అనే క్లినికల్ సైకాలజిస్ట్ వైద్యం చేస్తున్నాడు. నేను, నా కొలీగ్స్ ఇలాంటి కేస్ ఎప్పుడూ చూడలేదు. ఎన్నో రకాలుగా ట్రీట్‌మెంట్ చేస్తున్నాం. మెమొరీ లాస్ అవ్వకుండా చూస్తాం అంటూ సెలవిచ్చాడు. ఇతడి పేరు, ఇంటి అడ్రస్ తదితర వివరాలను మాత్రం మరచిపోలేదు.