Mountain View


అందాల రాక్షసి..@180 మర్డర్స్712

Smiley face

మెక్సికో మాఫియా ముఠాలుకు నిలయం. తలలను నరికేసి మొండాలను వీధుల్లో పడేసి భీతావహాన్ని సృష్టించే డ్రగ్ మాఫియా ముఠాలు సంచరిస్తుంటాయి. ఈ నగరంలో అందాల రాక్షసిగా తక్కువ సమయంలోనె మాఫియా రారాణిగా ఎదిగిందీ ‘లా చినా’ (ది ఆసియన్). లా చినా అసలు పేరు మెలిస్సా మార్గరిటా కాల్డరాన్ ఒజేడా. దాదాపు 180 మందిని నిర్ధాక్షిణ్యంగా చంపేసి తిరుగులేని లేడి డాన్‌గా ఎదిగిన ‘లా చినా’ మెక్సికన్ పోలీసులకు కునుకు లేకుండా చేసింది. తన మనుషులనుకున్న వారిని కూడా కళ్ల ముందే కాల్చి చంపుతుంది. ఆమె ఎంతోమంది శత్రు ముఠాల సభ్యులను కిడ్నాప్‌లు చేయించి, వారిని చిత్రహింసలకు గురిచేసింది. చివరకు మృతదేహాలను వారి కుటుంబాల ఇళ్ల గడపల ముందు పడేయించేది. దాదాపు 300 మంది లోకల్ డ్రగ్ డీలర్లను ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి వారందరికి ఎర్రరంగు మోటారు బైకులు, తుపాకులు ఇచ్చింది. గత ఏడేళ్లలో జరిగిన హత్యలకన్నా మాఫియా కమాండర్‌గా లా చిన్ బాధ్యతలు స్వీకరించాక హత్యలు ఆరింతలు పెరిగాయి. చివరకు ఆమెకు బాయ్ ఫ్రెండ్‌, మాఫియా గ్రూపుకి సెకండ్ ఇన్ కమాండ్‌గా ఉంటూ వచ్చిన పెడ్రో ఎల్ చినో ఆమె రక్తదాహాన్ని చూసి తట్టుకోలేక మాఫియా కార్టెల్ నుంచి పారిపోయి పోలీసులకు ‘లా చినా’ వ్యవహారం గురించి పూర్తిగా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆమె ఖననం చేసే రహస్య స్థలాల గురించి, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎలా పట్టుకోవచ్చో పోలీసులకు వివరించాక పోలీసులు వ్యూహం పన్ని చినాను అరెస్టు చేశారు.