Mountain View


కరాచిలొనే దావూద్ స్పస్టమైన అదారాలు1239

Smiley face

           ఓ నివాసంలో ఫోన్ మోగింది..!! హలో ఎవరు మాట్లాడేది? దావూద్ ఇబ్రహీం భార్యేనా అవునండీ.. ఆయన నిద్రపోతున్నారు... (మధ్యలోనే కాల్ కట్) కాసేపటికి అదే ఫోన్ మళ్లీ మోగింది...!! ఇప్పుడు మాట్లాడటం కుదరదు.. మళ్లీ కాల్ చేయండి...(కాల్ కట్) మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టు, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారుడు దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని కరాచీలోనే ఉన్నాడని నిరూపించే కీలక ఆధారం ఇది. కరాచీలో ఐఎస్‌ఐ రక్షణమధ్య మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీం భద్రంగా జీవిస్తున్నాడని భారత్ తన తాజా నివేదికలో పేర్కొంది. అందులోని ఫోన్ నంబరు ఆధారంగా ఒక మహిళా విలేకరి దావూద్ని వాసానికి ఫోన్ చేసినప్పుడు జరిగిన సంభాషణ ఇది! దావూద్ తమ దేశంలో లేనేలేడని  బుకాయిస్తున్న పాకిస్థాన్‌కు చెంపపెట్టులాంటి సాక్ష్యాలు ఇప్పుడు భారత్ వద్ద ఉన్నాయి.